E-Paper
Advertisement

America : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..

America : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..
Advertisement

America : అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేయాలనుకొనే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది అమెరికా. ముఖ్యంగా భారతీయులకు మేలు చేసేలా మరో ముందడుగు పడింది. ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ యాక్ట్‌-2022కు వైట్‌ హైస్‌ ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే యూఎస్‌ పార్లమెంట్‌ దిగువ సభలో ఓటింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జారీ చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి సంబంధించి నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే కార్డులు జారీ చేస్తోంది అమెరికా. యూఎస్‌ వెళ్లాలనుకున్న ఎవరికైనా అధిక వృత్తి నైపుణ్యాలున్నా.. అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే అలాంటి వారికి గ్రీన్‌ కార్డు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ తరహా నిబంధనలను అమెరికా ఎత్తివేస్తోంది. ఏదేశంలో పుట్టాడనే దానితో సంబంధం లేకుండా అత్యున్నత వృత్తి నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను ఒకే దేశం నుంచి అయినా సరే.. ఎక్కువ సంఖ్యలో తీసుకొనేందుకు ఈగల్‌ చట్టం అవకాశం కల్పించనుంది.

Advertisement

ఈగల్‌ చట్టం అమల్లోకి వస్తే భారతీయులకు ఎక్కువగా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రీన్‌ కార్డు పొందుతున్న భారతీయుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. వృత్తి నైపుణ్యాలున్న చాలా మందికి యూఎస్‌ వెళ్లాలనే కోరిక కలగానే మిగిలిపోతోంది. తాజాగా అమెరికా తెచ్చిన కొత్త చట్టంతో భారతీయులకు మేలు జరగనుంది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×