E-Paper
Advertisement

Nobel Peace Prize to Trump: ట్రంప్ కోరిక తీరింది.. లాక్కొన్న నోబెల్ శాంతి బహుమతి, నెక్ట్స్ ఏంటి?

Nobel Peace Prize to Trump: ట్రంప్ కోరిక తీరింది.. లాక్కొన్న నోబెల్ శాంతి బహుమతి, నెక్ట్స్ ఏంటి?
Advertisement

Nobel Peace Prize to Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరిక తీర్చుకున్నారా? నోబెల్ బహుమతి కోసం వెనిజులాను టార్గెట్ చేశారా? జరుగుతున్న పరిణామాలను గమనించిన  మరియా ఏం చేశారు? నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కి ఇచ్చేశారా? శాంతి బహుమతిని తన వద్ద ఉంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారా? అవుననే అంటున్నాయి అమెరికా అధికారిక వర్గాలు. దీని వెనుక అసలేం జరిగింది?

ట్రంప్‌కు నోబెల్ ఇచ్చేసిన మరియా

Advertisement

గురువారం అమెరికా వెళ్లారు వెనిజులా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత మరియా కొరీనా మచాడో. నేరుగా వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు ఆమె. తనకు వచ్చిన నోబెల్‌ అవార్డుని ఆమె ట్రంప్‌కు అందజేశారు. వెనిజులా దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా అందజేసినట్టు చెప్పారు.

వెనిజలా భవిష్యత్తు కోసం ఆయనతో చర్చించినట్టు తెలిపారు. మా దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికాపై ఆధారపడొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు సముద్రంలో చమురు ట్యాంకర్‌లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

నోబెల్ శాంతి తన వద్ద ఉంచుకోవాలని ట్రంప్ ఆలోచన

మచాడోతో సమావేశంపై అధ్యక్షుడు ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు. ఆమె ఇచ్చిన నోబెల్‌ పురస్కారాన్ని తాను అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆమెతో సమావేశం కావడం గొప్ప విషయమని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళని వర్ణించారు. తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్‌ బహుమతిని తనకు అందజేయడం, గౌరవానికి మంచి సంకేతమంటూ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ పోస్టు చేశారు.

శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్‌కు మచాడో ఇవ్వడంపై నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్పందించింది. నోబెల్‌ ఒకసారి ప్రకటించిన తర్వాత దానిని రద్దు లేదా ఇతరులకు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఐనప్పటికీ మచాడో తన నోబెల్‌ బహుమతిని ట్రంప్‌కు ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆ బహుమతిని ట్రంప్‌ తన వద్ద ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.

గతేడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ అవార్డు తన రాకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశాయి. చివరకు ఆ బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో దక్కింది. ఆమె చేసిన పోరాటానికి గుర్తింపుగా నోబెల్‌ని ఆమె సొంతం చేసుకుంది. ఆనాటి నుంచి అగ్గి మీద గుగ్గిలమయ్యారు అధ్యక్షుడు ట్రంప్.

ALSO READ:  అమెరికా వీసా వ్యవహారం.. తొలిసారి రియాక్టయిన పాకిస్థాన్

తనకు దక్కనిది, ఇతరులకు వెళ్లడంపై లోలోపల రగిలిపోయారు. అవార్డు అందుకున్న నెల రోజులు తిరిగే సరికి ఊహించని పరిణామం వెనిజులాలో చోటు చేసుకుంది. డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో వెనిజులాపై దాడి చేశాయి అమెరికా బలగాలు. చివరకు ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయి. కేవలంలో ఆయిల్ కోసం ట్రంప్ ఇదంతా చేశారని ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్న విషయం తెల్సిందే.

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్నరోజుల్లో మరియా.. వెనిజులా అధ్యక్షురాలు కావడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల అమెరికాకు మంచి జరుగుతుందని అంటున్నారు.  ఆయిల్ కూడా వారి సొంతం అవుతుందని అంటున్నారు. తెర వెనుక ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×