E-Paper
Advertisement

Amazon Layoffs : అమెజాన్‌లో స్టార్ట్ అయిన ఏరివేత..

Amazon Layoffs : అమెజాన్‌లో స్టార్ట్ అయిన ఏరివేత..
Advertisement

Amazon Layoffs : సంస్థ ఉద్యోగులను ఏరివేయడంలో ఇప్పుడు ట్విట్టర్ తరువాత అమెజాన్ వంతు వచ్చింది. త్వరలో అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు జరుగనున్నట్లు అమెరికన్ న్యూస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవసరం లేదనకున్న ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ హార్డ్‌వేర్ ఛీఫ్ డేవ్ లింప్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అమెజాన్‌ను మళ్లీ బలంగా పునర్నిర్మించే దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లింప్ పేర్కొన్నారని సంబంధింత వర్గాలు చెబుతున్నాయి.

అయితే తొలగించిన ఉద్యోగులకు వేరే అవకాశం చూపించే విధంగా సంస్థ సహాయసహకారాన్ని అందిస్తుందని లింప్ హామీ ఇచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్. తాజాగా జరిపే లేఆఫ్స్‌లో సుమారు 10వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. హ్యూమెన్ రిసోర్సస్, రిటైల్, డివైజస్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రధానంగా ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న మ్యానేజర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలను తొలగిస్తున్న విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి కెల్లీ నాన్‌టెల్ కూడా కన్ఫర్మ్ చేశారు.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×