E-Paper
Advertisement

Alexei Navalny death : నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?

Alexei Navalny death : నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?
Advertisement
Alexei Navalny

Alexei Navalny dead body : అలక్సీ నావల్నీ మృతదేహం అప్పగింతకు రష్యా ప్రభుత్వం నిరాకరిస్తోందా? అవుననే అంటున్నారు నావల్నీ మద్దతదారులు. అధికారులే హంతకులని, ఇది బయటపడకూడదనే డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

47 ఏళ్ల నావల్నీ ఆర్కిటిక్ జైలులో అనూహ్యకర రీతిలో నావల్నీ మృతి చెందారు. దర్యాప్తు పూర్తయిన తర్వతే కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగిస్తామంటూ అధికారులు చెబుతున్నారని నావల్నీ 69 ఏళ్ల తల్లి లిడ్మియా తెలిపింది. అసలు మృతదేహం ఎక్కడ ఉన్నదన్న విషయమూ అంతుపట్టడం లేదు.

Advertisement

నావల్నీ మారణవార్త అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్ పీనల్ కాలనీలోని జైలుకు వెళ్లారు. అప్పటికే మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్ నగరానికి తరలించారు. సలేఖార్డ్‌కు వెళ్లిన లిడ్మిలాకు నిరాశ తప్పలేదు. శవపరీక్షలు ముగియలేదని అధికారులు ఆమెకు చెప్పారు.

అధికారులు ఉద్దేశపూర్వకంగానే మృతదేహాన్ని దాచిపెడుతున్నారని మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.
ఇది ‘సడెన్ డెత్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. పుతిన్ వ్యతిరేకులు అనూహ్యకర పరిస్థితుల్లో మరణిస్తుండటంతో అలా వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

నావల్నీ మరణంపై పెద్ద ఎత్తున ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తున్నాయి. మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. దాదాపు 340 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×