E-Paper
Advertisement

Canada Earthquake: కెనడాలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్‌..?

Canada Earthquake: కెనడాలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్‌..?
Advertisement

Canada Earthquake: అలస్కా, కెనడా ప్రాంతంలో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. యూఎస్ జియోలాకల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.

అలస్కా, యుకానో సరిహద్దుల్లోని మారు మూల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. అలస్కాలోని జూనోకు దాదాపు 375 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పైగా సరిహద్దు ప్రాంతం కావడంతో ఎటువంటి సునామీ హెచ్చరికలు అవసరం లేదని ప్రకటించింది.

Advertisement

రాబోయే గంటల్లో చిన్న స్థాయి ఆఫ్టర్‌షాక్స్ సంభవించే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవా విభాగాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ భారీ భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 20కి పైగా చిన్న చిన్న ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి. వాటిలో ఒకటి 5.3 తీవ్రతతో మరోటి 5.0 తీవ్రతతో నమోదు అయ్యాయి. అలాస్కా ఎర్త్‌క్వేక్ సెంటర్ ప్రకారం, ఈ ఆఫ్టర్‌షాక్‌లు ముఖ్యంగా అలాస్కా-కెనడా సరిహద్దు ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×