E-Paper
Advertisement

భారీ యుద్ధానికి సన్నాహాలు.. టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్, రియాక్టయిన ఇరాన్, ట్రంప్ గడువు పొడిగిస్తారా?

భారీ యుద్ధానికి సన్నాహాలు.. టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్, రియాక్టయిన ఇరాన్, ట్రంప్ గడువు పొడిగిస్తారా?
Advertisement

Iran War: ఇరాన్‌పై అమెరికా యుద్ధం తీవ్రమవుతుందా? ట్రంప్ మళ్లీ పొడిగింపు ఇస్తారా? ఇరాన్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్ కు భీకర హెచ్చరికలు పంపారు.

టెహ్రాన్‌కు ట్రంప్ ఘాటు వార్నింగ్.. మళ్లీ పొడిగింపు ఉంటుందా?

Advertisement

ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన గడువు సోమవారం రాత్రి 8 గంటలతో ముగియనుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్నారు. హర్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరవాలని గతరాత్రి హెచ్చరించారు. లేకుంటే రెండు రోజుల్లో ఆదేశంలోని విద్యుత్‌ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా దాడులు చేస్తామన్నారు. ఇరాన్‌పై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిచ్చి మూర్ఖుల్లారా.. జలసంధిని తెరవండి లేకుంటే నరకాన్ని చూస్తారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను విధించిన డెడ్‌లైన్ కంటే ఇరాన్ ముందే ఒప్పందం చేసుకోవాలన్నారు. హోర్మూజ్ జలసంధి నుంచి నిరంతరం రాకపోకలు సాగాలన్నారు. తన మాట వినకుంటే ఇరాన్ లోని ప్రతీ ప్రాంతాన్ని పేల్చివేస్తామన్నారు. ముఖ్యంగా వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను నామరూపాలు లేకుండా చేస్తామన్నారు.

Advertisement

రియాక్టయిన ఇరాన్.. ఊహల్లో నుంచి బయటకు రావాలి

ఇరాన్‌లోని పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందన్నారు. అలాంటి రోజు మరొకటి ఉండదని తేల్చేశారు. హార్మూజ్‌ జలసంధి తెరకుంటే మీరు నరకంలో జీవిస్తారంటూ సూటిగా వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్‌ జలసంధి తెరవాలని ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ మార్గం ‍ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.

ఈ నేపథ్యంలో అమెరికా బెదిరింపులకు దిగింది. మరోవైపు ఇరాన్‌ ఏ మాత్రం బెదరడం లేదు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. వంతెనలపై ట్రంప్ బెదిరింపులు హాస్యాస్పదంగా ఉందని తెలిపింది. ట్రంప్ ఒక అస్థిరమైన, భ్రమల్లో బతికే వ్యక్తిగా అభివర్ణించింది.

ALSO READ: వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం.. రంగంలోకి సీక్రెట్‌ సర్వీస్‌

హోర్మూజ్ జలసంధి ప్రపంచ దేశాలకు తెరిచే ఉంటుందని వెల్లడించింది. అయితే ఇరాన్ శత్రువులకు హోర్మూజ్ మూసి ఉంటుందని తేల్చిచెప్పింది టెహ్రాన్. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలకు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని ఇరాన్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. ట్రంప్ బెదిరింపులు నవ్వు తెప్పిస్తున్నాయని తెలిపింది.

అసమాన యుద్ధంలో శత్రువును ఎలా బలహీనపరచాలో మాకు బాగా తెలుసని, స్పష్టమైన, సులభమైన దాడి అనే తన వ్యూహంలో అమెరికా విఫలమైందని తెలిపింది. మరోవైపు ఇరాన్‌తో నేటి నుంచి ఒమన్ చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ ఇరాన్ కు గడువు ఇస్తారా? లేదా అన్నది చూడాలి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×