E-Paper
Advertisement

Indian Techie Viral Video: యూఎస్‌లో ఉద్యోగం పోయింది.. వీడియో చేస్తే లక్షల్లో లైకులు..!

Indian Techie Viral Video: యూఎస్‌లో ఉద్యోగం పోయింది.. వీడియో చేస్తే లక్షల్లో లైకులు..!
Advertisement

Indian Techie Job Loss Video: ఇటీవల పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను వరుస పెట్టి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇది కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాల్లోను కొనసాగుతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయామంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుండడంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమెరికాలో తన ఉద్యోగం కోల్పోయినట్లు ఓ భారతీయుడు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో అగ్రరాజ్యంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుపుతూ నెటిజన్లతో పంచుకున్నాడు. తాను భారతసంతతికి చెందిన వ్యక్తినే అని తమ ఆఫీసు వాళ్లు నమ్మలేదని అన్నాడు. ఉద్యోగం నుంచి తీసేసే ముందు తనను చివరిసారిగా ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపాడు. తన స్థానాన్ని తన టీమ్ సభ్యుల స్థానాల్ని భారతీయులతో భర్తీ చేస్తున్నట్లు కంపెనీ తెలిపినట్లు చెప్పాడు. అయితే తాను కూడా ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తినే అని చెప్పినా కూడా వినిపించుకోలేదని.. ఇండియా నుంచి వచ్చే భారతీయులే కావాలని చెప్పారని అన్నాడు. ఎందుకంటే వారు తక్కువ జీతానికే పని చేస్తారని పేర్కొన్నాడు.

Advertisement

Also Read: Border Standoff: భారత్, చైనా మధ్య సయోధ్య.. హర్షం వ్యక్తం చేసిన అమెరికా

వీడియోలో చివరిగా తాను పుట్టింది ఇండియాలోనే అని కానీ తనకు రెండేళ్ల వయస్సు ఉన్న సమయంలో అమెరికాలో వచ్చి సెటిల్ అయినట్లు తెలిపాడు. భారతీయుడైన తాను ఉద్యోగం కోల్పోవడం, భారతీయులకే ఉద్యోగాలను ఇవ్వడం గురించి చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా 30 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×