E-Paper
Advertisement

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి
Advertisement

Sudan: సూడాన్‌లో ప్రకృతి కన్నెర్ర చేసింది. పశ్చిమ ప్రాంతంలోని మర్రా పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో గ్రామమంతా నేలమట్టం అయ్యింది. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

కొద్దిరోజులుగా సుడాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొండ కింద ఓ గ్రామంపై భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన ఆగస్టు 31న జరిగిందని స్థానిక ఆర్మీ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని తెలిపారు.గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని వెల్లడించారు.

Advertisement

కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు తగినంత సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి-అంతర్జాతీయ సహాయ సంస్థలను లిబరేషన్ మూవ్‌మెంట్ కోరింది.ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి- రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

అదే సమయంలో అక్కడ ప్రకృతి వీరిపై కన్నెర్ర చేసింది. ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి విపత్తు రూపంలో మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తోంది.

Advertisement

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×