E-Paper
Advertisement

Balochistan: బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల మారణకాండ.. 12 నగరాలపై దాడులు, 80 మంది మృతి

Balochistan: బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల మారణకాండ.. 12 నగరాలపై దాడులు, 80 మంది మృతి
Advertisement

Balochistan: పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్‌. ఆ ప్రాంతంలోని వివిధ నగరాలపై విరుచుకుపడ్డారు ఉగ్రవాదులు. ఒక్కమాటలో చెప్పాలంటే మారణహోమం సృష్టించారు. శుక్రవారం రాత్రి నుంచి ఉగ్రవాదులు దాడులు పెట్టారు. శనివారం రాత్రి వరకు కొనసాగాయి. దాదాపు 12 నగరాలను టార్గెట్ చేశారు.

బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల మారణకాండ

Advertisement

వాటిలో క్వెట్టా, గ్వాదర్, మక్రాన్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ముఖ్యంగా భద్రతా బలగాలు, పోలీస్ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రదాడులను తిప్పికొట్టే క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 10 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.

ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది నిషేధిత సంస్థ బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ. ఆపరేషన్ హెరోఫ్ భాగంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి మాట్లాడుతూ ఇప్పటివరకు 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

12 నగరాలపై దాడులు, 80 మంది మృతి

10 మంది పోలీసులు, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది మరణించారని ఆ రాష్ట్ర మంత్రి మొహ్సిన్ నఖ్వీ ధృవీకరించారు. ఈ వారం ప్రారంభంలో పంజ్‌గుర్, హర్నైల ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక చర్యల తరువాత హింస జరిగింది. ఆ ఘటనలో 41 మంది ఉగ్రవాదులు మరణించారు.

నుష్కీలోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ హెడ్ క్వార్టర్స్‌ను, ఫ్రాంటియర్ కార్ప్స్ స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికితోడు నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై అమర్చిన బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ALSO READ: 13 ఏళ్ల అమ్మాయితో ట్రంప్.. బిల్ గేట్స్‌కు లైంగిక వ్యాధి?

ఈ ఆపరేషన్లలో మరణించిన ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా బలగతాలు తెలిపాయి. వారంతా బలూచ్ తిరుగుబాటు గ్రూపులకు చెందినవారా? కాదా అనేది తేలాల్చివుంది. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సభ్యులు ఉన్నారా అనేది లేదా అనేదానిపై ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో బలూచిస్థాన్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర.

గ్వాదర్ పోర్ట్ సిటీలో పౌరులపై జరిగిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లో కొన్నాళ్లుగా తీవ్రవాద హింస అమాంతంగా పెరిగింది. గతేడాది ఈ ప్రావిన్స్‌లో మరణాల సంఖ్య 22 శాతం పెరిగింది. 2025లో పాకిస్థాన్ అంతటా ఉగ్రదాడుల తీవ్రత 34 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నమాట.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×