E-Paper
Advertisement

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం
Advertisement

Earth Quake : వరుస భూకంపాలతో ఆగ్నేయ ఆసియా ద్వీప దేశమైన ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. బండా సముద్రంలో ఈ భూకంపం వచ్చినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న వివరాలు తెలియలేదు.

ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికన్నా ముందు.. బుధవారం ఉదయం 11.53 నిమిషాలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో.. భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రంలో తరచూ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతుండటం వల్ల కూడా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే లక్ష 70 వేలమంది చనిపోయారు. శ్రీలంక, ఇండియాలతో కలిపి మొత్తం 2 లక్షల 20 వేల మంది మరణించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×