E-Paper
Advertisement

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు
Advertisement

Car crash at Texas: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌కు చెందిన ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల కాగా, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నాడు.

ప్రమాదం వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. కార్ పూలింగ్ ద్వారా దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు బెన్‌టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు వాహనంలో ఎక్కారు. అసలే విశాలమైన హైవే రోడ్లు, దీనికితోడు అతివేగం తోడయ్యింది. వరుసగా ఐదు వాహనాలు వెళ్తున్నాయి.

Advertisement

ALSO READ:  జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నం..129 మంది ఖైదీలు మృతి

ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు కారులో నుంచి నలుగురు భారతీయులు బయటపడలేకపోయారు. వీరి మృత దేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. అయితే కారు పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల భారతీయుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి మృతిపై ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

మృతుల్లో ఆర్యన్ రఘునాథ్.. హైదరాబాద్‌కి చెందని మాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ కొడుకు. వీరి సొంతూరు కర్ణాటక‌లోని రాయచూర్ ప్రాంతం. చాన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో సెటిలయ్యారు. రీసెంట్‌గా తమిళనాడులోని అమ‌ృత యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్, ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు.

తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల ముందు పేరెంట్స్‌తో మాట్లాడారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని కేంద్రాన్ని వాసుదేవన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×