E-Paper
Advertisement

China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది స్పాట్ డెడ్

China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది స్పాట్ డెడ్
Advertisement

China: అసలే ఎండాకాలం.. చిన్న నిప్పు వచ్చినా రాజేసినా తీవ్రత అస్సలు ఊహించలేము. కేవలం నష్టమేకాదు.. మనుషులు సైతం మృత్యువాట పడుతున్నారు. తాజాగా చైనాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22 మంది మృత్యువాట పడ్డారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చైనాలోని లియా వోయాంగ్‌ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతి స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ ఉన్న భవనంలో ఒక్కసారిగా రెండు, మూడు అంతస్తుల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ నెలలో చైనాలో జరిగిన రెండో అతి పెద్ద అగ్ని ప్రమాదం ఘటన.

ఏప్రిల్ 9న చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఓ నర్సింగ్‌ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో జరిగింది. ఆ ఘటనలో 20 మంది మరణించారు. రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో నర్సింగ్ హోమ్‌లో 260 మంది వృద్ధులు ఉన్న విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: దాయాది దేశానికి ఊహించని ఎఫెక్ట్, విమానాల తర్వాత నౌకా మార్గం

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×