E-Paper
Advertisement

Road Accident : గుంటలో పడిన ట్రక్కు.. 15 మంది మృతి!

Road Accident : గుంటలో పడిన ట్రక్కు.. 15 మంది మృతి!
Advertisement

Philippines Road Accident: లోతైన గుంటలో ట్రక్కు పడిపోవడంతో 15 మంది మరణించిన ఘటన సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో జరిగింది. ఈ ప్రమాదంపై మాబినే మునిసిపాలిటీ రెస్క్యూ ఆఫీసర్ మైఖేల్ కబుగాసన్ మాట్లాడుతూ.. ప్రజలను నీగ్రోస్ ద్వీపంలోని పశువుల మార్కెట్ కు ట్రక్కులో తీసుకెళ్తుండగా.. మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై పట్టుకోల్పోవడంతో.. అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మాబినే సమీపంలోని కొండప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రమాద సమయంలో ట్రక్కులో 17 మంది ఉండగా.. డ్రైవర్ తో పాటు మరొక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయపడ్డాడని తెలిపారు. రహదారికి సుమారు 50 మీటర్లు (164 అడుగులు) దిగువన ఉన్న లోయలో ట్రకక్కు శిథిలాలను గురించారు. నీగ్రోస్ ఓరియంటల్ ప్రావిన్స్ లో ట్రక్కు కొండపై నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి నెట్టింటిని షేక్ చేశాయి.

Advertisement

Read More: ప్రెసిడెంట్‌ను హత్య చేయించిన భార్య.. మాజీ ప్రధానికి కూడా కుట్రలో భాగం!

కాగా.. మెక్సికోలో సౌత్ స్టేట్ అయిన గెరెరోలు రెండు క్రిమినల్ గ్రూప్ ల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ వెల్లడించారు. మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల్ని ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×