E-Paper
Advertisement

Fire accident: చైనాలో అగ్నిప్రమాదం.. 15 మంది ఆహుతి

Fire accident: చైనాలో అగ్నిప్రమాదం.. 15 మంది ఆహుతి
Advertisement
Fire accident in China
Fire accident in China

Fire accident in China: చైనాలోని నాన్జింగ్ నగరంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోగా.. 44 మందికి కాలిన గాయాలయ్యాయి. నివాస సముదాయంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం.

ఆ అంతస్తులో ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. 80 లక్షల మంది జనాభా కలిగిన నాన్జింగ్ షాంఘైకి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనాలో స్కైస్రాపర్ అగ్నికీలల్లో చిక్కుకోవడం, దట్టమైన నల్లటి పొగ కమ్మేయడం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
మంటలు పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బందిని ఆ మంటలను అదుపు చేయగలిగారు. చైనాలో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

భద్రతా ప్రమాణాలు లోపించడం, అధికారుల అజమాయిషీ లేకపోవడమే ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. సెంట్రల్ సిటీ జిన్యులోగత నెలలో ఓ స్టోర్ తగలబడి పదుల సంఖ్యలో చనిపోయారు. బేస్‌మెంట్‌లో కార్మికులు నిబంధనలకు విరుద్ధంగా మంట రాజేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అంతకు కొన్నిరోజుల ముందే హెనన్ ప్రావిన్స్‌లో ఓ స్కూల్‌లో మంటలు రేగి 13 మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎలక్ట్రిక్ హీటింగ్ పరికరం వల్ల ఆ మంటలు వ్యాపించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.

నవంబర్ 26న షాంక్జి ప్రావిన్స్‌లో ఓ బొగ్గు కంపెనీ ఆఫీసులో అగ్నిప్రమాదంలో డజన్ల సంఖ్యలో కాలిబూడిదయ్యారు. అక్టోబర్ నెలలో బార్బిక్యూ రెస్టారెంట్‌లో సంభవించిన పేలుడు 31 మందిని బలి తీసుకుంది. నిరుడు ఏప్రిల్‌లో బీజింగ్‌లో అగ్నిప్రమాదానికి 29 మంది బలయ్యారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×