E-Paper
Advertisement

Bengaluru PG : పీజీలో యువతిపై కత్తితో దాడి.. ప్రేమోన్మాదం కాదు

Bengaluru PG : పీజీలో యువతిపై కత్తితో దాడి.. ప్రేమోన్మాదం కాదు
Advertisement

Bengaluru PG : తాను ప్రేమించిన యువతి ప్రేమను అంగీకరించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదనో ప్రేమోన్మాదులు యువతులపై దాడులకు పాల్పడుతున్నారు. కానీ బెంగళూరులో జరిగిన ఈ ఘటన అందుకు భిన్నం. పీజీలో ఉన్న యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలై మరణించింది. ఈ ఘటనంతా సీసీటీవీలో రికార్డయింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

బెంగళూరులోని ఒక పేయింగ్ గెస్ట్ హౌస్ లో బీహార్ కు చెందిన కృతి కుమారి(24) అనే యువతి ఉంటోంది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ యువతిపై ఓ యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో పొడిచి.. గొంతుకోసి పరారయ్యాడు. పక్క గదిలోనే యువతులు ఉన్నా.. వాళ్లు కనీసం అడ్డుకోలేదు. ఎవరూ స్పందించలేదు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి తనను కాపాడమని వేడుకోవడం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటన జరగడానికి రెండ్రోజుల ముందే ఆమె ఆ పీజీలోకి మారినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ సిబ్బందికి తాను కృతి సోదరుడినని, మాట్లాడి వెళ్లిపోతానని చెప్పి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Advertisement

Also Read : తిరుపతిలో దారుణం, గంజాయి మత్తు.. లా స్టూడెంట్‌పై అత్యాచారం

దీనంతటికీ కారణం.. ప్రేమే. అయితే ఆ యువకుడు ఆమెను ప్రేమించలేదు. అతను ప్రేమించిన తన ప్రియురాలిని ఆమె తన నుంచి విడగొట్టిందన్న కారణంతో ఆమెపై పగ పెంచుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలిని తనకు కాకుండా చేసిందన్న కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఇంత జరుగుతున్నా.. హాస్టల్ సిబ్బంది, వార్డెన్ కూడా స్పందించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. యువతిని హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉండటంతో.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×