E-Paper
Advertisement

బెంగాల్‌లో ఘోరం.. రైలు నుంచి జారిపడ్డ బాలుడు.. పట్టించుకోని సిబ్బంది!

బెంగాల్‌లో ఘోరం.. రైలు నుంచి జారిపడ్డ బాలుడు.. పట్టించుకోని సిబ్బంది!
Advertisement

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ బాధ్యతారాహిత్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఉదంతమే ఒక నిదర్శనం. జల్పాయ్‌గురి- రామ్ నగర్ రూట్‌లో ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఒక బాలుడు కింద పడిపోయాడు.

సాధారణంగా రైలులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు వెంటనే అలర్ట్ అవుతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తన తమ్ముడు కింద పడిపోవడంతో ఆ సోదరి హాహాకారాలు చేసింది. తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ఛైన్‌ను లాగారు. కానీ, లోకో పైలట్ మాత్రం రైలును ఆపకుండా ఏకంగా 1 కి.మీ మేర ముందుకు తీసుకెళ్లడం అత్యంత దిగ్భ్రాంతి కరం. ఛైన్ లాగినా స్పందించకపోవడం రైల్వే భద్రతా నిబంధనలను తుంగలో తొక్కడమే.

Advertisement

ఇక వ్యవస్థలో ఉన్న లోపాలు అక్కడితో ఆగలేదు. తన తమ్ముడిని కాపాడుకోవాలనే ఆవేదనతో ఆ సోదరి సహాయం కోసం రైలులోని TTE ని వేడుకున్నా, హెల్ప్‌లైన నంబర్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. సరైన స్పందన లభించకపోవడంతో ఆమె పడ్డ రోదన చూస్తున్న వారిని కలిచివేస్తోంది. ప్రయాణికుల ప్రాణాల కంటే సమయపాలన ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించిన సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే.. అత్యవసర సమయాల్లో రైల్వే వ్యవస్థ ఎంత నిస్సహాయంగా ఉందో అర్థమవుతోంది.

Advertisement

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. పుత్రోత్సాహమా? లేక?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×