E-Paper
Advertisement

Constables Arrested: పోలీసుల కారు ఆపిన పోలీసులు.. తనిఖీ చేస్తే అసలు గుట్టురట్టు, చివరిలో మరో ఊహించని ట్విస్ట్

Constables Arrested: పోలీసుల కారు ఆపిన పోలీసులు.. తనిఖీ చేస్తే అసలు గుట్టురట్టు, చివరిలో మరో ఊహించని ట్విస్ట్
Advertisement

Constables Arrested: విశాఖపట్నం , విజయనగరం జిల్లాల్లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజం ఏమిటంటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులే స్మగ్లర్లుగా మారడం. మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయి , రవాణాకు ఉపయోగిస్తున్న ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాలోని నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు కావడం గమనార్హం. వీరిద్దరూ అక్రమ సంపాదన కోసం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాతో చేతులు కలిపినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

Advertisement

ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఎస్పీ (APSP) మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శివప్రసాద్‌కు నేర చరిత్ర కొత్తేమీ కాదు. ఇతనిపై గతంలోనే పదికి పైగా దారిదోపిడీలు, దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వరుస నేరాలకు పాల్పడుతుండటంతో గతంలోనే అతడిని పోలీస్ శాఖ విధుల నుంచి తొలగించింది. అయినప్పటికీ.. పాత అలవాట్లతో మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ తన నెట్‌వర్క్‌ను పెంచుకుని, సర్వీసులో ఉన్న కానిస్టేబుళ్లను కూడా ప్రలోభపెట్టి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం వీరిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read: కాంగ్రెస్‌కు కవిత కౌంటర్ బడ్జెట్.. రూ. 2.23 లక్షల కోట్లతో మైండ్ బ్లాకింగ్ ప్లాన్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×