// // Triangle Love story - ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. నడిరోడ్డుపై అమ్మాయి కోసం -->
E-Paper
Advertisement

Triangle Love Story: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. నడిరోడ్డుపై అమ్మాయి కోసం

Triangle Love Story: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. నడిరోడ్డుపై అమ్మాయి కోసం
Advertisement

Triangle Love Story: విశాఖపట్నం సిరిపురంలో సినిమా సన్నివేశాలను తలపించేలా సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువతి కోసం ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని హల్‌చల్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన చైతన్య, విశాఖలో నివసిస్తున్న సూర్య కార్తికేయన్ అనే ఇద్దరు యువకులు ఒకే యువతిపై మక్కువ పెంచుకున్నారు. సిరిపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువతిపై గత కొంతకాలంగా చైతన్య లవ్ చేస్తుండగా, మరోవైపు సూర్య కార్తికేయన్ కూడా ఆమెతో ఆన్లైన్లో పరిచయం పెంచుకుని ప్రేమలో పడినట్లు సమాచారం.

Advertisement

ఈ నేపథ్యంలో యువతి కోసం గత కొద్ది రోజులుగా తరచూ గొడవలు పడుతున్నారు చైతన్య, సూర్య కార్తికేయన్. దీంతో ప్రేమికుల ఇద్దరితో మాట్లాడి ప్రాబ్లంని సెటిల్ చేసుకోవడానికి యువతి వారిద్దరినీ సిరిపురంలోకి పిలిపించింది.

ఈ క్రమంలో చైతన్య, సూర్య కార్తికేయన్ ఒకరిని ఒకరు దూషించుకుంటూ, చివరకు దాడి చేసుకునే స్థితికి వెళ్లారు. ఈ నేపథ్యంలో చైతన్య కత్తితో సూర్య కార్తికేయన్‌పై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

ఈ దాడిలో సూర్య కార్తికేయన్‌ మోచేయి, మణికట్టు వద్ద స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో యువతి తీవ్ర భయాందోళనకు గురయి వెంటనే త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చైతన్య, సూర్య కార్తికేయన్, అలాగే యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు.

చైతన్య డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సూర్య కార్తికేయన్ బీటెక్ పూర్తిచేసి, గేట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం త్రీ టౌన్ పోలీసులు ముగ్గురినీ విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. యువకుల గొడవలో యువతికి ఎటువంటి గాయాలు కాలేదని, సూర్యకు స్వల్ప గాయాలకు ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: ఘోరం.. డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు..

ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసి, చైతన్యపై దాడి, బెదిరింపు ఆరోపణలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×