// // Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే -->
E-Paper
Advertisement

Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే, అసలు కారణం అదే?

Vijayawada Crime: విజయవాడ మహిళ హత్య కేసు.. నిందితుడు అక్క కొడుకే, అసలు కారణం అదే?
Advertisement

Vijayawada Crime: విజయవాడలోని భవానీపురం మహిళ హత్య కేసులో ఏం జరిగింది? అసలు నిందితుడు ఎవరు? దగ్గర బంధువే హత్యకు పాల్పడ్డాడా? తన ఫ్యామిలీలో కలహాలకు ఆమె కారణమని భావించి హత్య చేశాడా? అవుననే అంటున్నారు విజయవాడ పోలీసులు. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

విజయవాడ మహిళ హత్య కేసు

Advertisement

విజయవాడ సిటీలో భవానీపురం ప్రాంతంలో 65 ఏళ్ల మహిళ హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితుడు ఆమెను చంపేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళ శరీర భాగాలను పడేశాడు. చిక్కుముడిగా మారిన ఈ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. చివరకు తీగలాగితే డొంకంతా కదిలింది. నిందితుడు ఎవరో తెలుసా? మృతురాలికి అక్క కొడుకు. ఫ్యామిలీ సమస్యల కారణంగా ఆ విధంగా చేసినట్టు తెలుస్తోంది.

విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లో ఉంటోంది 68 ఏళ్ల విజయలక్ష్మి. కొడుకుతో కలిసి వివాహ సంబంధాలు చూస్తుంటారు. ఆమె భర్త పిచ్చయ్య ఆరేళ్ల కిందట చనిపోయాడు. ఆమె అక్క కొడుకు నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం దశాబ్దం కిందట విజయవాడ వచ్చాడు. అతడికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

Advertisement

ముక్కలుగా చేసి పగ తీర్చుకున్న నిందితుడు

తొలుత టైలర్‌గా పని చేశాడు. కొంతకాలం షాపుల్లో గుమస్తాగా పని చేశాడు. ఏం జరిగిందో తెలీదుగానీ సుబ్రహ్మణ్యం దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సుబ్రహ్యణ్యం భార్య ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మహిళ.

తన ఫ్యామిలీని పిన్ని విడదీసిందని అనుమానించాడు సుబ్రహ్మణ్యం. చెప్పుడు మాటల కారణంగా భార్య వెళ్లిందని ఓ అంచనాకు వచ్చాడు. అంతేకాదు మూడేళ్ల కిందట తనపై కొందరు వ్యక్తులు దాడికి చేయడానికి పిన్ని కారణమని భావించాడు. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం, కసి పెంచుకున్నాడు.

ALSO READ:  ముదిరిపోయారు.. ఫామ్‌హౌస్‌లో మైనర్లు ట్రాప్ హౌస్ పార్టీ

సీన్ కట్ చేస్తే.. పిన్నికి ఎవరూ లేకపోవడం గమనించాడు. ఆమెపై పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కొడుకుతో విజయలక్ష్మిని అత్యంత కిరాతంగా హత మార్చాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వాటిని కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పడేశాడు.  గత నెల 30న విజయలక్ష్మి చిట్టినగర్‌లోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఆమెని ఇంటి వద్ద దింపుతానని చెప్పి టూ వీలర్స్‌పై ఇంటికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.  మృతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు . నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×