// // Husband Killed Wife: షాకింగ్ ఘటన.. చంపినా వారితో ఉంటా, భార్యని చంపేసి ఆ తర్వాత.. -->
E-Paper
Advertisement

Husband Killed Wife: షాకింగ్ ఘటన.. చంపినా వారితో ఉంటా, భార్యని చంపేసి ఆ తర్వాత..

Husband Killed Wife:  షాకింగ్ ఘటన.. చంపినా వారితో ఉంటా, భార్యని చంపేసి ఆ తర్వాత..
Advertisement

Husband Killed Wife: వివాహమైన నాలుగు నెలలకు భార్యని అనుమానించాడు. వివాహేతర సంబంధం ఉందంటూ భావించాడు. చివరకు పెనుభూతంగా మారింది.ఆ అనుమానంతో భార్య గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలోని కాన్పూర్ లో వెలుగు చూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

కాన్పూర్‌లో షాకింగ్ ఘటన

Advertisement

ఫతేహ్‌పూర్ జిల్లా మోహన్‌పూర్ గ్రామానికి చెందిన సచిన్ సింగ్ భదౌరియా వయస్సు 24 ఏళ్లు. అతడు 22 ఏళ్ల శ్వేతసింగ్‌ని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే అందుకు ఇరువురు0 కుటుంబ సభ్యులు ఏ మాత్రం అంగీకరించలేదు. నేరుగా కోర్టుకి వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత తొలుత సూరత్‌లో ఉండేవారు.

కొద్దిరోజుల తర్వాత ఆ దంపతులు కాన్పూర్‌కి మకాం మార్చారు. సచిన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. సరదాగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం మొదలైంది. శ్వేత బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడంపై అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆమెని నిలదీశాడు.

Advertisement

చంపినా వారితో ఉంటా.. భార్యని చంపిన భర్త

తన అమ్మమ్మ పంపిందని తెలిపింది. సచిన్ దంపతులున్న ఎదురింట్లో ఉండే యువకులపై అనుమానం కలిగింది. ఆ తర్వాత పెనుభూతంగా మారింది. భార్య ప్రవర్తన గమనించడానికి ఓ స్కెచ్ వేశాడు. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని భార్యకి చెప్పాడు సచిన్. అనుకోకుండా తిరిగి వచ్చి గది తలుపు తెరిచి చూసేసరికి భార్యతోపాటు ఇద్దరు యువకులు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యాడు.

ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో దంపతులను తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత సచిన్‌-భార్యకు మధ్య తారాస్థాయికి చేరింది. తనను చంపినా ఆ యువకులతో ఉంటానని శ్వేత, తన భర్తను బెదిరించినట్టు తెలిసింది. దీన్ని తట్టుకోలేక పోయిన సచిన్, ఆగ్రహంతో భార్య గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత నాలుగు గంటల పాటు కాన్పూర్ సిటీలోని తిరిగాడు.

ALSO READ: విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆ తర్వాత యువకులు పైలోకానికి

పారిపోవాలని భావించినప్పటికీ ఎవరూ లేకపోవడంతో లొంగిపోవాలని డిసైడ్ అయ్యాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వెళ్లి శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. తాము ఒకరి నొకరు మాత్రమే ఉన్నామని, పారిపోయి పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. మాకు ఎవరూ లేరని, అందుకే స్టేషన్‌కి వచ్చి లొంగిపోయానని తెలిపాడు. ఈ ఘటనపై శ్వేత కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×