E-Paper
Advertisement

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి
Advertisement

3 people died due to electric shock: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర ఇతర వార్తా కథనాల ప్రకారం.. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారు.

అయితే, ఆదివారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. అనంతరం ఆమె ఇంట్లో పని చేసి వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం 3 గంటలకు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి.. మరోసారి ఇళ్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్ రూమ్ డోర్ లాక్ అలాగే ఉండడంతో అనుమానం వచ్చి అపార్ట్ మెంట్ నిర్వాహకులకు విషయం తెలియజేసింది.

Advertisement

Also Read: రీల్స్ చేస్తూ..రియల్ గానే పోయాడు..అంబర్ పేటలో విషాదం

వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే, తొలుత వీరు విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు భావించినప్పటికీ, అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించనున్నట్లు పోలీసులు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×