// // Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు..! -->
E-Paper
Advertisement

Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!

Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!
Advertisement

Label Tampering: స్వేచ్ఛ బ్యూరో: అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్స్ (ఔషధ తయారీలో ఉపయోగించే సహాయక పదార్థాలు)పై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్, కల్పిత తయారీ వివరాల వినియోగం కేసును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైడ్రాక్సీప్రొపైల్ బెటాడెక్స్..

విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఏ అధికారులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ, ప్లాట్ నెం.124, హెచ్.నెం.1-5-1095/1/1, మూడో అంతస్తులో ఉన్న డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. దాడుల సందర్భంగా హైడ్రాక్సీప్రొపైల్ బెటాడెక్స్ యూఎస్పీ/ఎన్‌ఎఫ్ అనే ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్‌కు చెందిన 12 కార్డ్‌బోర్డ్ డ్రమ్‌లు గుర్తించారు. ఒక్కో డ్రమ్‌లో 20 కిలోల చొప్పున మొత్తం 240 కిలోల నిల్వ ఉన్నట్లు తేలింది. వాటిపై బ్యాచ్ నెం. RHPB/2026/05/002, తయారీ తేదీ 05/2026, గడువు తేదీ 04/2029గా లేబుళ్లు అతికించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Also Read: YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!

తయారీ చిరునామా..

అలాగే ఉత్పత్తి తయారీదారుగా డీకే ఫార్మాస్యూటికల్స్, తయారీ చిరునామాగా ప్లాట్ నెం.59/B, ఈపీఐపీ, పశమైలారం, సంగారెడ్డి జిల్లా అని పేర్కొనగా, విచారణలో ఆ తయారీ యూనిట్ కల్పితమని, ఆ చిరునామాలో ఎలాంటి తయారీ కేంద్రం లేదని అధికారులు నిర్ధారించారు. తదుపరి విచారణలో డీకే ఫార్మాస్యూటికల్స్ భాగస్వాములు సతీష్ బాబు ధూలపల్లి, నాగస్వామి కట్రగడ్డ అసలు లేబుళ్లను తొలగించి, నకిలీ లేబుళ్లు అతికించి ఉత్పత్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన అధికారులు, రూ.70.56 లక్షల విలువైన ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Also read: Huzurabad: హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×