// // Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడికి అడ్లకాడతో వాతలు పెట్టిన టీచర్ -->
E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడికి అడ్లకాడతో వాతలు పెట్టిన టీచర్

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల బాలుడికి అడ్లకాడతో వాతలు పెట్టిన టీచర్
Advertisement

Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఓ ట్యూషన్ టీచర్ దారుణానికి పాల్పడింది. చదువు సరిగా రావడం లేదనే చిన్న కారణంతో ఆగ్రహానికి లోనైన టీచర్, ఆ చిన్నారి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే ఇలా వ్యవహరించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర నిరసన చేస్తున్నారు.

విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్..
అయితే హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో శ్రీమానస అనే ట్యూషన్ టీచర్, ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థిపై దారుణంగా దాడి చేసింది.. చదువు సరిగ్గా చదవడం లేదనే కోపంతో, చిన్నారిని అట్లకాడతో కాల్చినట్లుగా సమాచారం ఇచ్చారు. బాలుడి శరీరంపై ఎనిమిది చోట్ల తీవ్రమైన వాతలు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

నడవలేక ఇబ్బందిపడుతున్న బాలుడు..
ముఖ్యంగా చేతులు, కాళ్లు, ముఖంపై ఈ గాయాలు ఉన్నాయని, దీంతో బాలుడు సరిగా నడవలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు అక్షరాలు నేర్పించాల్సిన చోట, ఇలాంటి దారుణమైన శిక్ష అమలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడితో గాయపడిన చిన్నారి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు
తమ కొడుకుపై జరిగిన ఈ దారుణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ట్యూషన్ టీచర్ శ్రీమానసపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన బాలుడిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Also Read: పక్కా ప్లాన్ ప్రకారమే పిలిచి! బీరంగూడ లవ్ అండ్ మర్డర్ స్టోరీలో అసలు కథ ఇదే!

టీచర్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ చర్యకు పాల్పడిన ట్యూషన్ టీచర్ శ్రీమానసపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే, టీచర్లపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలను శారీరక దండనకు గురిచేసే వారి పట్ల ఎటువంటి ఉపేక్ష చూపకుండా కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×