// // Tamilnadu Accident: తమిళనాడులో ఘోరం.. లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి! -->
E-Paper
Advertisement

తమిళనాడులో ఘోరం.. లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి!

తమిళనాడులో ఘోరం.. లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి!
Advertisement

Tamilnadu Accident: తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. పొల్లాచ్చి సమీపంలోని వార్‌పేడే (Valparai) ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం.

కేరళలోని కోజికోడ్ నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. వాల్‌పారై ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన 12వ హెయిర్‌పిన్ బెండ్ (మలుపు) వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ వేగంగా లోయలోకి దూసుకెళ్లింది. మృతులంతా కేరళ వాసులుగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

వాల్‌పారై ఘాట్ రోడ్డులో మలుపులు చాలా లోతుగా ఉండటం, పైగా వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మోజ్ జలసంధి ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×