// // Switzerland Explosion: న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు.. వందల్లో మృతులు? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Switzerland Explosion: న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు.. వందల్లో మృతులు?

Switzerland Explosion: న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు.. వందల్లో మృతులు?
Advertisement

Switzerland Explosion:స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక మంది మృతి చెందారు. స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మోంటానాలోని ఒక బార్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడులో సంభవించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించగా, పలువురు గాయపడ్డారు. పేలుడుకు కారణం ఇంకా తెలియలేదని స్విట్జర్లాండ్‌ వాలిస్ కాంటన్‌ పోలీసులు తెలిపారు.

టూరిస్టులు ఎక్కువగా వచ్చే కాన్స్టెలేషన్ బార్‌లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలు జరుగుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించారో, గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియడంలేదన్నారు.

బార్‌లో 100 మందికి పైగా

Advertisement

పేలుడు సంభవించిన సమయంలో.. బార్ లో 100 మందికి పైగా ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నారు. సెలవుల సీజన్ కారణంగా పెద్ద ఎత్తున టూరిస్టులు క్రాన్స్ మోంటానాకు వచ్చారు. పేలుడు జరిగిన సమయంలో బార్‌లో వంద మందికి పైగా ఉన్నారని పోలీసులు కూడా ధృవీకరించారు. పేలుడుపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనలో 40 మంది పైగా మరణించారని స్థానిక మీడియా చెబుతోంది. పేలుడు దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు వైరల్ అవుతున్నాయి. పేలుడు తర్వాత బార్‌లో భారీగా మంటలు చెలరేగాయి.

న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం

స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మోంటానా స్కీ పట్టణం న్యూ ఇయర్ వేడుకలకు పెట్టింది పేరు. వేల సంఖ్యలో ప్రజలు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటారు. బుధవారం రాత్రి కూడా నూతన సంవత్సర వేడుకలు ఎంతో జోష్ తో ప్రారంభం అయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక మంది మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారని పోలీసులు నివేదించారు. ఫైర్ ఫైటర్స్, పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్లు ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Advertisement

మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని స్విస్ వార్తా సంస్థ చెబుతోంది. అయితే, పేలుడు ఇంకా కారణం తెలియదని పోలీసులు తెలిపారు.

క్రాన్స్-మోంటానా అనేది స్విస్ రాజధాని బెర్న్ నుంచి దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న వాలాయిస్ ప్రాంతంలో ఆల్ప్స్ పర్వతాల మధ్యలోని ఒక విలాసవంతమైన స్కీ రిసార్ట్ పట్టణం. ఈ పట్టణంలో బ్రిటిష్ పర్యాటకులు ఎక్కువగా ఉంటారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×