E-Paper
Advertisement

Road Accident: కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదం.. ఓకే ఫ్యామిలీలో నలుగురు మృతి, ఇలా మీరు చేయొద్దు!

Road Accident: కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదం.. ఓకే ఫ్యామిలీలో నలుగురు మృతి, ఇలా మీరు చేయొద్దు!
Advertisement

Road Accident: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిట్ రూట్ దాటిపోవడంతో డ్రైవర్ చిన్న పొరపాటు చేశాడు. ఫలితంలో ఓ కుటుంబంలోని నాలుగు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

యూపీలో ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం.. 

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా సమీపంలోని ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని బహదూర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ఆయన భార్య ప్రీతి, తల్లి సుదేశ్, కొడుకు శివాంశ్ తో కలిసి కారులో హరిద్వార్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రావెల్ చేస్తున్నారు.

అయితే వారు దిగాల్సిన ఎగ్జిట్ పాయింట్‌ను గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు కారు డ్రైవర్. ఆ తర్వాత పొరపాటు తెలుసుకున్న కారు డ్రైవర్.. వెళ్లిన మాదిరిగా వెనక్కి వస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం.. ప్రవీణ్ కారును బలంగా ఢీకొట్టింది. వెనుక నుంచి వచ్చిన కారు వేగానికి ప్రవీణ్ కారు కుడి-ఎడమవైపు డివైడర్‌ని కొట్టింది కొన్ని మీటర్ల దూరంగా వెళ్లిపోయింది.

Advertisement

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై  కారు రివర్స్.. వెనక నుంచి మరొక వాహనం ఢీ 

ఈ ప్రమాదంలో ప్రవీణ్ కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రవీణ్, ప్రీతి, సుదేశ్, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినవారిని తోటి వాహనదారులు రక్షించే ప్రయత్నం చేశారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఆ జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ చౌహాన్, ఎస్పీ అభినందన్ అక్కడికి చేరుకున్నారు.

బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జిట్‌ను దాటి వెనక్కి వస్తున్న కారును అతివేగంతో వస్తున్న ఎస్‌యూవీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: కర్ణాటకలో ఘోరం.. యువతిపై కత్తితో దాడి చేసి, పెట్రోల్ బాంబుతో వ్యక్తి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం జోరుగా సాగుతోంది.  ఆయా రోడ్లపై వాహనాలు వేగం మినిమమ్  గంటకు 100 కిలోమీటర్లు పైగానే ఉంటుంది.  ఒక వేళ ఈ మాత్రం స్లో అయినా వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఢీ కొన్ని సందర్భాలు ఇటీవల కాలంలో చూస్తున్నాము.  దయచేసి అలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు అంతా చెక్ చేసుకున్న తర్వాత ప్రయాణించండి.  ఇప్పుడు ప్రవీణ్ కారు చేసిన తప్పు చేయకండి.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×