// // Mahabubabad: మహబూబాబాద్‌లో కిరాతకం.. నిద్రిస్తున్న అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు! -->
E-Paper
Advertisement

Mahabubabad: మహబూబాబాద్‌లో కిరాతకం.. నిద్రిస్తున్న అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు!

Mahabubabad: మహబూబాబాద్‌లో కిరాతకం.. నిద్రిస్తున్న అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన అల్లుడు!
Advertisement

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో వివేకాన్ని కోల్పోయిన ఓ అల్లుడు, కన్నతల్లిలా చూడాల్సిన అత్తను అత్యంత కిరాతకంగా విద్యుత్ షాక్ ఇచ్చి హతమార్చాడు. సీతంపేట శివారులోని మంగళతండాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఈ ఘాతుకానికి పాత గొడవలే కారణమని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజేష్ అనే వ్యక్తి తన సోదరుడు రమేష్‌కు అంజలి అనే మహిళతో మూడు రోజుల క్రితమే రెండో వివాహం జరిపించాడు. అయితే, ఈ పెళ్లి విషయంలో రాజేష్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను, ఈ వివాహంపై తన కుటుంబ సభ్యులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరిగి అది గొడవగా మారడంతో రాజేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

Advertisement

అందరూ నిద్రిస్తున్న సమయంలో తన ఉన్మాదాన్ని ప్రదర్శించిన రాజేష్.. గాఢనిద్రలో ఉన్న అత్త కంసాలి (48) మెడకు విద్యుత్ వైరును చుట్టి షాక్ ఇచ్చాడు. ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. అక్కడితో ఆగని నిందితుడు, కొత్తగా పెళ్లయిన అంజలిపై కూడా కత్తితో దాడికి తెగబడ్డాడు. తన భార్యతో పాటు కన్న తల్లిదండ్రులను సైతం గాయపరిచేందుకు ప్రయత్నించగా, వారు అప్రమత్తమై అక్కడి నుండి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలు కంసాలి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: ప్రాణం పోయాల్సిన తల్లే.. ప్రాణ సంకటంగా మారింది.. రూ. 2 లక్షలకు కూతురిని విక్రయించిన కసాయి తల్లి!

చిన్న వివాదానికి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ఆ తండాలో విషాద ఛాయలు నింపింది. మద్యం మత్తు మనిషిని ఎంతటి క్రూరత్వానికైనా పురిగొల్పుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×