// // Road Accident: లోయలో పడిన ట్రావెల్ వాహనం.. స్పాట్‌లో 22 మంది, కుల్లు ప్రాంతంలో ఘటన -->
E-Paper
Advertisement

లోయలో పడిన ట్రావెల్ వాహనం.. స్పాట్‌లో 22 మంది, కుల్లు ప్రాంతంలో ఘటన

లోయలో పడిన ట్రావెల్ వాహనం.. స్పాట్‌లో 22 మంది, కుల్లు ప్రాంతంలో ఘటన
Advertisement

Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లుకు వెళ్తున్న ఓ ట్రావెల్ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లో మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

కుల్లు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలోకి పడిన ట్రావెల్ వాహనం

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి పర్యాటకులతో టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు.

గాయపడినవారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. రాత్రి వేళ ఘటన జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గురైన టెంపో వాహనం జలోరి పాస్ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

స్పాట్‌లో నలుగురు మృతి.. గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమం

ప్రమాదం జరిగిన బంజర్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఝీబీలోని ఒక హోటల్‌లో ఈ పర్యాటకులు బస చేస్తున్నారు. తెరిపి లేకుండా ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల్లు డిప్యూటీ కమిషనర్ అనురాగ్ చందర్ మాట్లాడారు.

వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందన్నారు. ఘటన సమయంలో వాహనంలో 20 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 22 మంది ఉన్నారని తెలిపారు. ఘటనా స్థలంలో ఎవరూ చిక్కుకుపోలేదన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది నిర్ధారించుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: ఆత్మహత్యకు సిద్ధమైన ఫ్యామిలీ.. పోలీసులు వారిని ఎలా కాపాడారంటే?

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×