E-Paper
Advertisement

ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!
Advertisement

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న వినీశ్ అనే విద్యార్థి, ప్రేమ వ్యవహార కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

మహాబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్, క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఒక్కసారిగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు  చేయడం చూసిన స్థానికులు, తోటి విర్యార్ధులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

వైద్యుల సమాచారం ప్రకారం.. వినీశ్ శరీరంలో సుమారు 70 శాతం మేర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో భాగంగా, ప్రేమ వ్యవహారమే ఈ కఠిన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:రాష్ట్రంలో ఫ్రీగా లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×