E-Paper
Advertisement

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?
Advertisement

ఒక్క‌సారి క‌మిట్ అయితే.. నా మాట నేనే విన‌ను! పోకిరీ సినిమాలో మ‌హేశ్‌బాబు డైలాగ్ ఎంతగా ఆక‌ట్టుకుందో.. ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే .. బ్లైండ్‌గా ముందుకు వెళ్ల‌డ‌మే మ‌న మాట మ‌న‌మే వినొద్ద‌ని.. క‌విత ఇచ్చిన పిలుపు కూడా మ‌హిళా లోకానికి స్పూర్తిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో వెటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఆమె ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది.

మ‌హిళ‌లపై ఎంత‌టి వివ‌క్ష ఉందో.. వారిని ఎద‌గ‌నీయ‌కుండా ప‌రిస్థితులు, స‌మాజం, కుటుంబం ఎలా ఆటంకంగా మారాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పారు ఆమె. త‌న సొంత అనుభ‌వాన్నిఇందులో జోడించి మాట్లాడిన‌ట్టుగా అనిపించింది. త‌న‌కు కుటుంబప‌రంగా జ‌రిగిన అన్యాయంతో పాటు.. స‌మాజం నుంచి వ‌చ్చే ఆద‌ర‌ణ ఎలా ఉంది..? ఎవ‌రెలా స్పందిస్తున్నార‌నే విష‌యాల‌పై ఆమె ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడారు.

Advertisement

ప్ర‌పంచ‌మే మ‌హిళ‌ల‌కు సానుకూలంగా లేద‌ని చెబుతూనే ఎట్టి ప‌రిస్థితుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని వీడ‌రాద‌నే విధంగా ఆమె పిలుపునిచ్చారు. సొసైటీలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ఆమె వివరిస్తున్న‌ప్పుడు.. ఆశ్చ‌ర్య‌పోయారంతా. అంత‌టి వివ‌క్ష ఇంకా కొన‌సాగుతుందా? అని ముక్కున వేలేసుకున్నారు తెలియ‌ని వాళ్లు. ఆమె ఇచ్చిన ప్ర‌సంగం.. మ‌హిళా లోకానికే కాదు…పురుషుల‌కు, పాల‌కుల‌కు కూడా క‌నువిప్పు క‌లిగించేలా ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌యింది.

ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని, ఎంత కష్టపడినా ప్రతిభ చూపినా సరే మహిళకు ఎక్కడో అడ్డుకట్ట పడుతోందన్నారు క‌విత‌. సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలని, మహిళలు తమ లక్ష్యంపై నిర్ణయం తీసుకుంటే మీ మాట మీరే వినవద్దు..అని ఆత్మ‌స్థైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు క‌విత‌. స‌మాజంలో రెండే కులాలున్నాయ‌ని, ఒకటి మహిళల కులం, ఇంకొకటి మగవాళ్ల కులమ‌న్నారు. టాలెంట్, కష్టపడే గుణం ఉన్నప్పటికీ వాటి ఆధారంగా అవకాశాలు రావటం లేదన్నారు. అయినా సరే ఎంతో మంది మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మగవాళ్లతో పోటీ పడి మరి కష్టపడుతున్నారని, కానీ మనకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట ఉంటుందన్నారు.

Advertisement

ఈ ప్రపంచమే మనకు ప‌క్ష‌పాతంగా వ్య‌హ‌రిస్తోంద‌న్నారు. ఆడ, మగ సమతుల్యం అనేది ఇక్క‌డ లేద‌న్నారు. మహిళ సాధికారత జరగాలంటే ప్రభుత్వం, ఫ్యామిలీ, సోసైటీ అందరూ హెల్ప్ చేయాలన్నారు. అన్ని రంగాల్లో 50 శాతం మహిళ ఉద్యోగులు ఉండాలని ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిన సరే ఫ్యామిలీ సహకరించదని ఆమె వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. తెలంగాణ వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నామ‌ని, కానీ ఆ 33 శాతం కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కావటం లేదన్నారు.

అంటే మహిళలకు ఇంట్లో, సోసైటీ నుంచి సపోర్ట్ ఉండటం లేక‌పోవడంతోనే ఇలా జ‌రుగుతుంద‌ని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పటికీ కూడా కొంచెం భిన్నంగా ఉంటే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఒక రాజకీయ నాయకురాలిగా ఏదైనా మాట్లాడితే లక్ష మంది వరకు త‌న‌ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారే త‌ప్ప‌.. మాట్లాడిన అంశంపై కాకుండా జెండర్ బేస్డ్ గా మాట్లాడుతుంటార‌ని విమ‌ర్శించారు. ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో 15-19 ఏళ్లలో పెళ్లై అమ్మలు అయిన వాళ్లు 7.2 శాతం ఉన్నారన్నారు. ప్రభుత్వాలు టీనేజ్ మ్యారేజ్ లను తగ్గించేందుకు ఎంత ప్రయత్నం చేసిన సరే పెద్దగా మార్పు రావటం లేదని తెలిపారు క‌విత‌. హైదరాబాద్ లో కూడా టీనేజ్ మదర్స్ 2.7 శాతం ఉన్నారన్నారు.

అంటే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిందని తల్లితండ్రులు భావిస్తుండ‌టమే దీనికి కార‌ణ‌మ‌న్నారు. సమాజంలో ఒక్క రోజులో మార్పు రాదని, అందుకు ఆడ, మగ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న యువత సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్ కోసం ఆలోచిస్తోందని, అది అల్గరిథమ్ బేస్డ్ గా ఉంటుందని, అలా కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలన్నారు. ఇంటర్ నెట్, ఇప్పుడొచ్చిన ఏఐ కూడా మ‌హిళ‌ల ప‌ట్ల బ‌యాస్డ్‌ గా ఉంటుందన్నారు. అంటే గతంలో మహిళల మీద ఉండే వార్తలను, అభిప్రాయాలను బట్టే ఏఐ సమాచారం అందిస్తుంద‌ని, అందుకే మీరు ఎలా ఉన్నారన్నది మ్యాటర్ కాదు.. మీ మనసులో ఉన్న లక్ష్యం కోసం ఎలా కష్టపడతారన్నదే మ్యాటర్..
నిర్ణయం తీసుకోనే వద్దు.. తీసుకుంటే మాత్రం మీ మాట మీరే వినకుండా కష్టపడాలి.. అని ఆమె పిలుపునిచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×