// // Kamareddy Crime: మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి లైంగిక దాడి -->
E-Paper
Advertisement

Kamareddy Crime: మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి లైంగిక దాడి.. కట్ చేస్తే..

Kamareddy Crime: మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి లైంగిక దాడి.. కట్ చేస్తే..
Advertisement

Kamareddy Crime: నేటి సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. మానవత్వం పరిమళించాల్సిన చోట మృగత్వం రాజ్యమేలుతోంది. అనురాగం పంచాల్సిన రక్త సంబంధాలే కామంతో కళ్లు మూసుకుపోయి.. విచక్షణ కోల్పోయి పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తున్నాయి. వరుస, వావి అనే తేడా లేకుండా కన్నవారే కాలయముళ్లవుతుంట.. సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. చిన్నారి అని చూడకుండా, వృద్ధురాలు అని గౌరవించకుండా కామాంధులు చేస్తున్న అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. శారీరకంగా పెరిగినా మానసికంగా ఎదగని అభాగ్యులను చిన్నపిల్లల్లా చూసుకోవడం మన బాధ్యత. కానీ.. అదును చూసి వారిని అగాయిత్యాలకు గురిచేస్తున్న కామాంధుల చర్యలు చూస్తుంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనే ప్రశ్న తలెత్తుతోంది. అటువంటి సంఘటనే నేడు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొమ్మందేవపల్లి గ్రామంలో మతిస్థిమితం సరిగాలేని ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన నాగారం పాపయ్య అనే వృద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. గ్రామ సమీపంలోని ముండ్ల పొదల ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న బాలిక మేనమామకు అనుమానం కలిగి ఆ ప్రాంతానికి వెళ్లగా.. నిందితుడు బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించాడు. వెంటనే అప్రమత్తమైన మేనమామ నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చుట్టుపక్కల వారిని సమాచారం అందించాడు.

Advertisement

సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని నిందితుడని దేహశుద్ధి చేశారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారకుంగా ఉండేందుకు స్థానిక పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Hyderabad News: ఇది కదా కావాల్సింది.. అక్రమ కబ్జాలపై హైడ్రా మెరుపు దాడి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×