E-Paper
Advertisement

మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్‌లో ఎగిసిపడ్డ మంటలు!

మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్‌లో ఎగిసిపడ్డ మంటలు!
Advertisement

Nalgonda: నల్గొండ జిల్లాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సబ్ స్టేషన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో సబ్ స్టేషన్‌లోని విలువైన యంత్రాలు ,విద్యుత్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Advertisement

మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

Also Read: నో బిన్.. నో బిజినెస్: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన కీలక ప్రకటన

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×