// // Nagarkurnool: ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురి పరిస్థితి విషమం! -->
E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం!
Advertisement

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వెల్దండ మండలం రాగాయపల్లి స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారును రాగాయపల్లి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న వారు లోపలే చిక్కుకుపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా శ్రీశైలం హైవేపై కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నరసాపురం కాలవలో విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్థిని గల్లంతు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×