// // Highway Crash: ముంబయి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్.. 12 మంది మృతి -->
E-Paper
Advertisement

ముంబయి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

ముంబయి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Advertisement

Highway Crash: ముంబయి-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిపై మహారాష్ట్ర పరిధిలోని ధనివరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్కును, వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ట్రక్కు పూర్తిగా నుజ్జునుజ్జవగా.. అందులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన వాహనాల క్యాబిన్ల నుంచి క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: రేవంత్ కంటే నాకే ఆస్తులు ఎక్కువ.. జగిత్యాల వేదికగా ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×