E-Paper
Advertisement

దంపతుల మధ్య డ్యాన్స్ వివాదం.. కోపంతో భర్త ఏం చేశాడంటే, అందరూ పైలోకానికి

దంపతుల మధ్య డ్యాన్స్  వివాదం.. కోపంతో భర్త ఏం చేశాడంటే, అందరూ పైలోకానికి
Advertisement

Madhya Pradesh: చిన్నిచిన్న సమస్యలకు కోపాలు, ఆగ్రహాలు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా ఆవేశంలో చేయరాని పనులు చేస్తున్నారు. అందుకు ఎగ్జాంఫుల్ పైన కనిపిస్తున్న దంపతులు. గ్రామీణ ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌లో భార్య డ్యాన్స్ చేసినందుకు తట్టుకోలేకపోయాడు ఆమె భర్త. పట్టరానికి కోపంతో భార్య, ఇద్దరు పిల్లలను నరికి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్య ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన.. దంపతుల మధ్య డ్యాన్స్ చిచ్చు

Advertisement

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కిషన్‌పూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు ఆమె భర్త. ఈ ఘటన తర్వాత తేరుకున్న ఆమె భర్త.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది?

కిషన్‌పూర్ గ్రామంలో బలరామ్ కుష్వాహా-భార్య రవితా కుష్వాహా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. బలరామ్ ఫ్యామిలీ సంసారం హాయిగా సాగుతున్న సమయంలో చిన్న చిచ్చు వచ్చింది. పది రోజుల కిందట గ్రామంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బలరామ్ భార్య రవిత డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో కాస్త వైరల్ అయ్యింది.

Advertisement

భార్య-ఇద్దరు పిల్లల్ని దారుణంగా నరికి చంపిన భర్త, ఆపై భర్త ఆత్మహత్య

ఈ సమస్య భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. గడిచిన వారం రోజులుగా ఎడముఖం పెడముఖంగా వ్యవహరించారు. భర్త టార్చర్ తట్టుకోలేక రవితా పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు కుటుంబానికి చెందిన పెద్దలు సర్ది చెప్పడంతో ఈనెల 24న తిరిగి అత్తవారింటికి వచ్చింది రవితా. ఐనప్పటికీ భర్త మనసులో భార్య డ్యాన్స్ వ్యవహారం వేధించడం మొదలుపెట్టింది.

ఆ సమస్యను కంట్రోల్ చేయలేకపోయాడు. ఫలితంగా శుక్రవారం రాత్రి బలరామ్ తన భార్య, ఇద్దరు మైనర్ కొడుకులను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు. ఆ ఘటన తర్వాత తన కోపం తీరిందని భావించారు. వెనక్కి తిరిగి చూస్తే భార్య, పిల్లలు శవాలు కనిపించడంతో తట్టుకోలేకోపోయాడు. చివరకు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు.

ALSO READ: జనాల తలరాత మారుస్తానన్న పూజారి.. తనే జైలుపాలయ్యాడు.. క్లైమాక్స్ మాములుగా లేదుగా!

రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికి బలరామ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చాలాకాలంగా వీరి మధ్య అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు మొరేనా డీఎస్పీ విజయ్ భదోరియా. అవే ఈ దారుణానికి పాల్పడేలా చేసిందని తెలియజేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×