E-Paper
Advertisement

Dry Fruit Milk: డ్రై ఫ్రూట్​ మిల్క్​‌లో గంజాయి చాక్లెట్లు కలకలం

Dry Fruit Milk: డ్రై ఫ్రూట్​ మిల్క్​‌లో గంజాయి చాక్లెట్లు కలకలం
Advertisement

Dry Fruit Milk: డ్రై ఫ్రూట్​ మిల్క్​‌లో గంజాయి చాక్లెట్లు కలిపి అమ్ముతున్న వ్యక్తిని ఎక్సయిజ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి గంజాయి కలిపి ఉన్న 1,92‌‌0 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన వికాస్​ వర్మ కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. అనంతరం డ్రై ఫ్రూట్​ మిల్క్​ అమ్మటం మొదలు పెట్టాడు. వేడి చేసి చల్లార్చిన పాలలో డ్రై ఫ్రూట్స్​, ఐస్​ ను కలిపి చుడీబజార్​, బేగంబజార్​ మధ్యలో 50 రూపాయలకు గ్లాసు చొప్పున అమ్ముతున్నాడు. కాగా, దీంట్లో ఆశించినంత లాభాలు రాకపోతుండటంతో పాలల్లో గంజాయి కలిపి విక్రయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: Praveena Deshpande: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణ దేశ్ పాండే కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడి..

ఒక్కో చాక్లెట్​ లో అయిదు గ్రాములు..

Advertisement

ఈ క్రమంలో గంజాయి చాక్లెట్లు కొని తెచ్చి పాలల్లో కలుపుతూ ఒక్కో గ్లాసును 150 రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారం అందగా ఎస్టీఎఫ్​ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేసి వికాస్​ రాజ్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి గంజాయి కలిపి ఉన్న చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒక్కో చాక్లెట్​ లో అయిదు గ్రాముల గంజాయిని మిక్స్​ చేసినట్టుగా నిందితుడు వెల్లడించాడు. హోలీ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని పెద్ద మొత్తంలో ఈ చాక్లెట్లను తెప్పించినట్టుగా చెప్పాడు. నిందితునిపై కేసులు నమోదు చేసిన ఎస్టీఎఫ్​ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం చార్మినార్​ ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు.

Also Read: Indiramma Houses: RRR,ORR ప‌రిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. వచ్చేనెల మార్చి కల్లా ల‌బ్దిదారుల ఎంపిక‌..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×