E-Paper
Advertisement

శ్రీపెరంబుదూర్ హ్యుందాయ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

శ్రీపెరంబుదూర్ హ్యుందాయ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
Advertisement

Hyundai Fire: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రముఖ హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలోని ఒక విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం ఇంకా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Also read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×