E-Paper
Advertisement

Road Accident: విషాదం.. కారును ఢీకొట్టని మరో కారు.. దంపతులు మృతి

Road Accident: విషాదం.. కారును ఢీకొట్టని మరో కారు.. దంపతులు మృతి
Advertisement

Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు తమ కారులో ప్రయాణిస్తుండగా… భూత్పూర్ పరిధిలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన మరో కారు అతివేగంగా వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టని వేగానికి కారు పూర్తిగా నుజ్జు నుజ్జుయ్యింది. కారులో ఉన్న దంపతులకు తీవ్రగాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం కర్నూలు వాసులుగా గుర్తించి.. వారి బంధువులకు సమాచారం అందించారు.

ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. వెనుక నుంచి ఢీకొట్టిన కారు డ్రైవర్ అజాగ్రత్త లేదా నిద్రమత్తులో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసలు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×