// // Kiss At Gunpoint: జలపాతం వద్ద అదేంపని.. కాలేజీ జంటతో కిస్, ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్ -->
E-Paper
Advertisement

Kiss At Gunpoint: జలపాతం వద్ద అదేం పని.. గన్‌తో ఆ జంటని బెదిరించి, కిస్ పెట్టించి ఆ తర్వాత

Kiss At Gunpoint: జలపాతం వద్ద అదేం పని.. గన్‌తో ఆ జంటని బెదిరించి, కిస్ పెట్టించి ఆ తర్వాత
Advertisement

Kiss At Gunpoint: దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే ఇబ్బందులు తప్పవు. పైన కనిపిస్తున్న ఇద్దరు యువకుల విషయంలో అదే జరిగింది. డబ్బుల కోసం ఓ జంటను బెదిరించి లొంగ దీసుకున్నారు. గన్‌తో బెదిరించి కిస్ పెట్టించి తమ కోరిక నెరవేర్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన జార్ఖండ్‌లోని ఓ జలపాతం వద్ద వెలుగుచూసింది.

జార్ఖండ్‌లో దారుణం.. జలపాతం వద్ద 

Advertisement

నిర్మాణుష్యమైన ప్రాంతాల్లోకి వెళ్లే యువతియువకులకు జాగ్రత్త. అక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. జర్గా పంచాయతీ పరిధిలోని బృందాహ జలపాతాన్ని బైక్‌పై పిక్నిక్ స్పాట్‌కి వెళ్లారు ఇద్దరు కాలేజీ విద్యార్థులు.

అందులో ఒకరు అమ్మాయి కాగా, మరొకరు అబ్బాయి. తిరిగి రావడానికి సిద్ధమవుతుండగా ఇద్దరు యవకులు.. వార్ని అడ్డగించారు. వారి నుంచి బైక్ కీని తీసుకున్నారు. ప్రశ్నలతో వారిని వేధించారు. చివరకు తుపాకీతో ఆ స్టూడెంట్స్‌‌పై గురిపెట్టారు. దీంతో హడలిపోయారు విద్యార్థులు.

Advertisement

గన్‌తో ఆ జంటని బెదిరించి.. ఆ తర్వాత తమ పని కానిచ్చారు

వారిద్దరు ముద్దు పెట్టుకునేలా బలవంతంగా చేశారు. ఆ తతంగాన్ని తమ వద్దనున్న మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో చూపించి డబ్బుల ఇవ్వాలని వారిని బ్లాక్ మెయిల్ చేశారు. తమకు 10 వేల రూపాయలు ఇవ్వకుంటే షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

భయపడిన విద్యార్థులు.. తమ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి యూపీఐ ద్వారా ఆ ఇద్దరు యువకుల ఖాతాలోకి దాదాపు 4.635 రూపాయలు బదిలీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిద్దరు పారిపోయారు. ఈ తర్వాత ఈ విషయాన్ని కాలేజీ యువతియువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానికంగా ఉండే పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ:  డివైడర్ ని ఢీ కొట్టి బోల్తాపడిన బస్సు.. స్పాట్‌లో 35 మంది విద్యార్థులు

మొబైల్ లొకేషన్, లావాదేవీ వివరాలను ఉపయోగించి నిందితులను పట్టుకుంటున్నారు. డబ్బులు వసూలు చేసిన బబ్లూ యాదవ్, అజిత్ యాదవ్ అరెస్టు చేశారు.  టూరిస్టు ప్రాంతం కావడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×