E-Paper
Advertisement

కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్‌షాప్‌ దగ్ధం

కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్‌షాప్‌ దగ్ధం
Advertisement

Kishan Bagh: హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోఫా తయారీ వర్క్‌షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. వర్క్‌షాప్‌లో సోఫాల తయారీకి ఉపయోగించే ప్లైవుడ్, కుషన్లు, ఇతర కలప సామాగ్రి భారీగా ఉండటంతో నిప్పు రవ్వలు వేగంగా విస్తరించి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదైంది.

ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై సమాచారం అందించినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించలేదని స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు రావడం ఆలస్యం కావడం వల్లే మంటలు అదుపు తప్పి ఆస్తి నష్టం భారీగా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు త్వరితగతిన అంది ఉంటే ఇంతటి నష్టాన్ని నివారించే వీలుండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Also Read:సంగారెడ్డి జైల్లో క్రిశాంక్‌ను పరామర్శించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×