E-Paper
Advertisement

Gang Rape in Bihar: బీహార్‌లో దారుణం.. మైనర్ పై సామూహిక అత్యాచారం..

Gang Rape in Bihar: బీహార్‌లో దారుణం.. మైనర్ పై సామూహిక అత్యాచారం..
Advertisement
Telugu Breaking News

Gang Rape in Bihar(Telugu breaking news):

సాయంత్రం స్కూల్ తర్వాత ట్యూషన్ సెంటర్‌‌కు వెళ్తున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళుతుండగా.. దారిలో ఒక దుండగుడు అడ్డగించాడు.

Advertisement

అక్కడి నుంచి ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లాడు. కొంత సమయం తర్వాత అక్కడికి మరో ఇద్దరు యవకులు వచ్చారు. ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు అక్కడి నుంచి పారిపోగా.. మరో ఇద్దరు యువకులు బాధితురాలిపై మరోసారి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘోరం జరిగిన తర్వాత బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలు ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×