E-Paper
Advertisement

Apartment Fire: స్విచ్చాఫ్ చేయడం మరిచారు.. సర్వం కోల్పోయారు.. జీడిమెట్లలో పెను ప్రమాదం!

Apartment Fire: స్విచ్చాఫ్ చేయడం మరిచారు.. సర్వం కోల్పోయారు.. జీడిమెట్లలో పెను ప్రమాదం!
Advertisement

Apartment Fire: గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఒక చిన్న అజాగ్రత్త ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

ప్రమాదం ఎలా జరిగింది?

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం అపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌ను ఆన్ చేసి, దానిని పొరపాటున ప్లాస్టిక్ కుర్చీపై పెట్టి మర్చిపోయారు. నీళ్లు వేడెక్కాక స్విచ్చాఫ్ చేయడం మర్చిపోవడంతో.. హీటర్ నుండి వెలువడిన విపరీతమైన వేడికి ప్లాస్టిక్ కుర్చీ కరిగి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు క్షణాల్లోనే గది అంతా వ్యాపించాయి.

సిలిండర్ పేలుడుతో పెరిగిన తీవ్రత

Advertisement

మంటల ధాటికి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ప్రమాద తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్ గోడలు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా, నలువైపులా దట్టమైన పొగ కమ్మేసింది. భయంతో కుటుంబ సభ్యులు, పొరుగువారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు కానీ, ఇంట్లోని విలువైన వస్తువులన్నీ పూర్తిగా బూడిదయ్యాయి. ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులను వాడేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Also Read: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. మీ పాన్ కార్డులో ఆ వివరాలు ఉంటే ఇక సబ్సిడీ రానట్టే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×