// // Siricilla Crime: సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు -->
E-Paper
Advertisement

Siricilla Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు

Siricilla Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు
Advertisement

Siricilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెపల్లి గ్రామం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు దుర్మరణం చెందారు. వీరి చిన్నారి కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన దంపతులు తమ ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల వైపు వెళ్తుండగా.. ఎదురుగా కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న ఒక భారీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు దంపతులకు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే మార్గమధ్యలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను కరీంనగర్ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు సిరిసిల్ల వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రోడ్డు ప్రమాదంలో అభాగ్యులు దుర్మరణం చెందటం స్థానికంగా విషాదం నింపింది.

Advertisement

మృతుల కుమార్తె మైఫియా పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు అత్యవసర చికిత్స అందించడం కోసం వెంటనే కరీంనగర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ వైద్య చికిత్స కొనసాగుతోంది. మైఫియా ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోరం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రహదారుల మీద ప్రయాణించేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగంగా దూసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దంపతుల మృతి చిన్నారి పరిస్థితి కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ALSO READ: Guntur News: లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్, చివరకు?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×