E-Paper
Advertisement

వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి

వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి
Advertisement

Jayashankar Bhupalpally district: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం ఉదయం
జిల్లా రవాణా అధికారి-డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణమైన ఘటన

Advertisement

బొగ్గు లోడుతో వెళ్తున్న వేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. చివరకు జిల్లా రవాణా అధికారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు వారాల కిందట జగిత్యాల నుండి బదిలీపై భూపాలపల్లికి డీటీఓగా వచ్చారు వెంకన్న. ఘటన తర్వాత లారీ డ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు. ప్రమాదానికి కారణమైన TS 22T2687 లారీపై ఐదు ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. అందులో సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పెనాల్టీలు ఉన్నాయి.

Advertisement

వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో మృతి

లారీ డ్రైవర్ బీహార్‌కు చెందినవాడు. నిందితుడు పేరు తస్లీమ్. అతడికి లైసెన్స్ లేదని గుర్తించారు అధికారులు. 5 పెండింగ్ చలాన్లలో విలువ రూ.4240. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తికి లారీ అప్ప జెప్పిన ఓనర్ పేరు మహబూబ్ ఖాన్. అనుకోకుండా జరిగినా ప్రమాదమా? కుట్ర పూరితంగా డీటీఓను హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఈ ఘటన తెలియగానే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతిపై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సదరు మంత్రి.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు, 250 కిలోమీటర్ల వేగంతో 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×