// // Kadapa Town: కడప టౌన్‌లో చెడ్డీ గ్యాంగ్ హంగామా.. కత్తులతో సంచారం, ఆపై పోలీసులపై దాడులు -->
E-Paper
Advertisement

Kadapa Town: రాయలసీమలో చెడ్డీ గ్యాంగ్ హంగామా.. కత్తులతో సంచారం, పోలీసులపై దాడులు

Kadapa Town: రాయలసీమలో చెడ్డీ గ్యాంగ్ హంగామా.. కత్తులతో సంచారం, పోలీసులపై దాడులు
Advertisement

Kadapa Town: తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు జోరందుకున్నాయా? దొంగతనాలకు ఈసారి రాయలసీమ ఎంపిక చేసుకున్నారా? ముఖ్యంగా కడప టౌన్‌ని టార్గెట్ చేసిందా? అర్ధరాత్రి వేళ పలు ప్రాంతాల్లో కత్తులతో తిరుగుతోందా? అడ్డొచ్చిన పోలీసులపై దాడులు చేసేందుకు వెనుకాడడం లేదా? అవుననే అంటున్నారు కొందరు పోలీసు అధికారులు.

సీమని వణికిస్తున్న చెడ్డీ గ్యాంగ్

Advertisement

చెడ్డీ గ్యాంగ్ గురించి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు చెప్పనక్కర్లేదు. పగటి వేళ జనాలతో కలిసిపోవడం వీరికి అలవాటు. టార్గెట్ లను ఫిక్స్ చేసి రాత్రివేళ తమ ప్రతాపం చూపిస్తుంది. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడులు చేస్తారు గ్యాంగ్ సభ్యులు. ఒకవేళ పట్టుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారి చేతుల నుంచి జారిపోవడం వీరికి వెన్నుతో పెట్టిన విద్య.

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలోనూ వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఈసారి సీమలోని కొన్ని జిల్లాలను టార్గెట్ చేశారు. తొలుత కడప టౌన్ పై ఫోకస్ చేసింది ఆ గ్యాంగ్. కడప టౌన్‌లోని వైఎస్సార్‌ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు జోరందుకున్నారు. అర్థరాత్రి వేళ కత్తులతో సంచరిస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కారు.

Advertisement

కత్తులతో సంచారం.. చోరీ, ఆపై దాడులు

తొలుత పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను చూసి పరుగులు తీసిన ఈ గ్యాంగ్, ఆ తర్వాత వారిపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఎర్ర ముక్కపల్లి ప్రాంతంలో నాలుగు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్. మూడు ఇల్లు ఖాళీగా ఉండటంతో వాటిని చోరీ చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రిమ్స్‌ ఠాణా పరిధిలో శిల్పారామం వద్ద ఓ ఇంటిని చోరీ చేశారు. అక్కడ 10 గ్రామాల బంగారు చోరీ అయ్యింది. వరుసగా ఎనిమిది నివాసాల్లో చోరీలు జరగడంతో నగర టౌన్ వాసులు భయపడుతున్నారు. కడప ఎప్పుడూ ఈ విధంగా లేదని ఇదే తొలిసారని అంటున్నారు.

ALSO READ: చిత్తూరు జిల్లాలో స్కూల్ ఆటో బోల్తా.. స్పాట్‌లో 13 మంది విద్యార్థులు

జిల్లాలో అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తోందరి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పగటి వేళ వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన నివాసాలను గుర్తిస్తున్నారు. రాత్రి వేళ చోరీలకు దిగుతున్నారు. వరుస చోరీల వెనుక దొంగల ముఠా ఉందని పోలీసులు వారి భావన. ఏయే ప్రాంతాలైతే ఆ గ్యాంగ్ సంచారం చేసిందో, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాని ఆధారంగా వేలిముద్రలను సేకరించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×