// // Hyderabad News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం -->
E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం.. డివైడర్, బైక్‌ని ఢీ కొట్టి, కారులో ముగ్గురు

Hyderabad News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం.. డివైడర్, బైక్‌ని ఢీ కొట్టి, కారులో ముగ్గురు
Advertisement

Hyderabad News: అతి వేగం ప్రమాదకరం పదే పదే పోలీసులు చెబుతున్నారు. అయినా యువత ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది మత్యువాత పడుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వంతెనపై ఓ కారు బీభత్సం చేసింది.

హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సం

Advertisement

ఉదయం దాదాపు 8 గంటల సమయంలో రైతుబజార్‌ దాటి వంతెన ఎక్కింది ఓ కారు. అందులోని వారు అతి వేగంతో కారుని డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. తొలుత డివైడర్‌ ఢీ కొట్టారు. బ్యాలెన్స్ కాకపోవడంతో ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ని ఢీ కొట్టింది. చివరకు ఆ కారు బోల్తా పడింది. అప్పడు గానీ ఆ కారు వేగం తగ్గలేదు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు.  ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు యువకులు, ఓ అమ్మాయి ఉంది. వారంతా సూడాన్‌కి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వారంతా కారు దిగిపోయారు. అక్కడి నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకుని మెల్లగా జారుకున్నారు.

Advertisement

డివైడర్.. బైక్‌ని ఢీ కొట్టిన కారు

కారు నెంబరు ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరంచే పనిలో పడ్డారు పోలీసులు. కారు బీభత్సం వెనుక అసలేం జరిగింది? కారుని యువకులు అద్దెకు తీసుకున్నారా? లేకుంటే ఎవరి దగ్గరైనా తీసుకుని రైడ్‌కి వచ్చారా? ఘటన సమయంలో వారు మద్యం తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ:  చేతబడి.. పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత ఆమె కూడా

కారు డ్రైవింగ్ చేసిన యువకులు నగరంలో చదువుతున్నట్లు తెలుస్తోంది. వారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు సమాచారం.  వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి వుంది.  ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశారు పోలీసులు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×