// // Road Accident: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్‌లో 36 మంది -->
E-Paper
Advertisement

సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్‌లో 36 మంది

సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్‌లో 36 మంది
Advertisement

Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65పై వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. హైదరాబాద్ నుండి ఏలూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు.

స్పాట్‌లో 36 మంది..
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి.

Advertisement

ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డ ప్రయాణికులు..
ప్రమాదం జరిగిన తీరు అత్యంత భీతావహంగా ఉంది. బస్సు ముందు భాగం దెబ్బతినడంతో ప్రధాన ద్వారం పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి మార్గం లేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ప్రయాణికులు, బస్సు వెనుక భాగంలో ఉన్న అత్యవసర ద్వారం తెరిచి ఒకరి తర్వాత ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. చీకటి సమయంలో ఈ సాహసోపేతమైన చర్య వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

Also Read: యమునా నదిలో పడవ ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం!

Advertisement

నిద్రమత్తే కొంపముంచిందా?
ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వేగంగా వెళ్తున్న క్రమంలో డ్రైవర్ కనురెప్ప వేయడంతో బస్సు అదుపు తప్పి లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారులపై రాత్రి సమయాల్లో డ్రైవర్ల అజాగ్రత్త ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×