// // Bihar Road Accident:ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి -->
E-Paper
Advertisement

బీహార్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. 30 మందికి గాయాలు

బీహార్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. 30 మందికి గాయాలు
Advertisement

Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై రక్తం చుక్క ఆరకముందే మరో ప్రమాదం పొంచి ఉందన్న చేదు నిజం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. కటిహార్ జిల్లా కోడా బ్లాక్ పరిధిలోని NH-31 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.

అతి వేగమో లేదా అజాగ్రత్తే తెలియదు కానీ.. ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా మృత్యువు విరుచుకుపడింది. బస్సు, పికప్ వ్యాన్ మ,ట్రక్కు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది. ఈ భీకర ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా పూర్నియా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పొట్టకూటి కోసం వెళ్తున్నారో లేక ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నారో కానీ, గమ్యం చేరకుండానే ఇలా మధ్యలోనే తనువు చాలించడం అత్యంత బాధాకరం.

Advertisement

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని ప్రకటించింది.

Advertisement

Also Read:  వేలిముద్రల మిస్టరీ.. ప్రపంచంలో ఏ ఇద్దరివి ఒకేలా ఎందుకు ఉండవు?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×