E-Paper
Advertisement

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని
Advertisement

Bengaluru Triple Murder: ఇప్పుడు సమాజంలో సహజీవనం పెద్ద ట్రెండ్‌గా మారింది. దీన్ని ఓ స్టేటస్‌గా కొందరు చెప్పుకుంటున్నారు. దీని బారిన పడిన యువతీ యువకులు తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. ఇలాంటివి మనకు వద్దని చెప్పినందుకు తల్లిదండ్రులు, చెల్లిని చంపేసింది మరొక కూతురు.

బెంగుళూరులో ట్రిపుల్ మర్డర్ కలకలం

Advertisement

బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్‌లో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. సీగేహళ్లి-ధమనిక్ లేఅవుట్లో సాయి‌గ్రీన్ అపార్ట్మెంట్లో సోమసుందర్, అతని భార్య ముత్తులక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు.  చిన్న కూతురు సుప్రియ, పెద్ద కూతురు శ్వేత.

బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్‌లో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. సీగేహళ్లి-ధమనిక్ లేఅవుట్లో సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో సోమసుందర్, అతని భార్య ముత్తులక్ష్మి, చిన్నకూతురు సుప్రియ, మరొక కూతురు శ్వేత నివాసం ఉంటున్నారు.

Advertisement

ఆ ఫ్యామిలీలో సహజీవనం చిచ్చు..  పేరెంట్స్-చెల్లిని లేపేసిన పెద్ద కూతురు

శ్వేత.. ఓ వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. శ్వేత సుమారం రూ.30 లక్షల అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పేరెంట్స్‌తో శ్వేత గొడవకు దిగేది. సోమవారం రాత్రి తండ్రి-చెల్లెలు ఇంట్లో లేని సమయంలో శ్వేత, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అపార్ట్మెంట్‌కు వెళ్లింది.

ఒంటరిగా ఉన్న తల్లితో వాగ్వాదానికి దిగింది. అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు భావిస్తున్నారు. గదిలో రక్తపు మరకలను కడిగి తండ్రి-చెల్లి కోసం ఇంట్లోనే కాపు కాశారు. సుప్రియ ఇంటికి రాగానే అదే ఆయుధంతో దాడి చేసి చంపేశారు.

ALSO READ: భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. రాసలీలలో భర్త బిజీ, సీసీటీవీకి అడ్డంగా చిక్కాడు

చివరగా తండ్రి సోమసుందర్ ఇంటికి వచ్చారు. ఆయన్ని ఆ ఆయుధంతో పొడిచారు. తీవ్ర గాయాలు పాలైన సోమసుందర్ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాపాడాలంటూ సహాయం కోసం అరుపులు పెట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కేఆర్ పురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఒకర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నారట పోలీసులు. పరారీలో ఉన్న శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కోసం గాలింపు చేపట్టారు. పై విషయాలను పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, త్వరలో మరిన్ని వివరాలు చెబుతామని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×