// // Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి నుంచి కారు బోల్తా,.. -->
E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి నుంచి కారు బోల్తా, నలుగురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి నుంచి కారు బోల్తా, నలుగురు మృతి
Advertisement

Road Accident: మహారాష్ట్రలోని   కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.

కాగజ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం వైద్య పరీక్షల నిమిత్తం కారులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా..  మహారాష్ట్ర సరిహద్దులోని సోండో వద్ద కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుండి కిందకు పడిపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

Advertisement

ఈ విషాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,  ఒక చిన్నారి (బాలిక) ఉన్నారు. వీరంతా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న వారు శవాలుగా మారడంతో కాగజ్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×